DNB News - ఆంధ్రప్రదేశ్ / : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో అంబటి రాంబాబు తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని కూన రవికుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ, అంబటి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నోరు పారేసుకున్న కారణంగానే ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని, ఘోర పరాజయం ఎదురైనా అంబటి రాంబాబుకు సిగ్గు రావడం లేదని మండిపడ్డారు. వైసీపీ మళ్లీ బూతుల సంస్కృతిని రాజకీయాల్లోకి తెస్తూ రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తోందని ఆరోపించారు. గొడవలు, హత్యలకు ప్రయత్నించే ధోరణిని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంబటిని రాజకీయాల నుంచి బహిష్కరించాలన్నారు. తన నోరును అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.
Admin
DNB News