Monday, 15 June 2026 01:52:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

సమాజ సేవలో నిరంతరం కొనసాగాలి – గౌరవ డాక్టరేట్ గ్రహీతలకు ఘన సన్మానం..

Date : 08 April 2026 05:05 PM Views : 94

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్‌లో గల తోటలో గౌరవ డాక్టరేట్ పురస్కార గ్రహీతలు డాక్టర్ చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ ఎస్ జి ఎం సుభాన్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య, తెలుగు భాష వికాస ఉద్యమ నేత జెఎస్ఆర్కే శర్మ, పారిశ్రామికవేత్త సోమల గూడూరు రుక్మంగాధర్ రెడ్డి పాల్గొని, దుశాలో కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆత్మీయ అతిథులు యం. ఆంధ్రయ్య, ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ సింగ్, మాజీ డీఎస్పీ పీరా సాహెబ్ పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలు గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవ, వైద్య సేవలు, సాంస్కృతిక మరియు రంగస్థల రంగాలలో చేసిన సేవలను వక్తలు కొనియాడారు. వీరి సేవలను గుర్తించి అమెరికా టెక్సాస్‌లోని డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు డాక్టర్ బాబు మోహన్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షుడు రత్న కుమార్, డాక్టర్ వరప్రసాద్, సినీ నటుడు ఘర్షణ శ్రీనివాస్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ కుమారి, రచయిత డి. పార్వతయ్య, సయ్యద్ రోషనలి, పాణ్యం గోవిందరాజులు తదితరులు రంగస్థల పద్యాలు, పాటలతో సభను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, తమ సేవలను గుర్తించి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా ని కూడా జి. పుల్లయ్య గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పి. దస్తగిరి, పి. హనుమంతరావు చౌదరి, ఎం. మనోహర్ బాబు, డిఎన్వి సుబ్బయ్య, డి. పుల్లయ్యతో పాటు కళాప్రియ తిరుపాలు, ఎం. చంద్రశేఖర్, చంద్రకాంతరెడ్డి, షేక్షావల్లి, ఋషికుమార్, సిద్దిక్ భాష, సుభాన్ భాష, వెంకటేశ్వర్లు, రాజన్న, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం, కర్నూలు జిల్లా.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :