DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై కఠిన నిఘా ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలపై ప్రత్యేక దాడులు కొనసాగుతున్నాయని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలు, కాలేజీల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యం పెంచాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Admin
DNB News