Saturday, 13 June 2026 07:10:34 AM
# రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.. # ISPL టోర్నమెంట్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి.. క్రీడాకారులకు ప్రోత్సాహం.. # కేంద్ర సబ్సిడీ రుణ పథకాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోండి: ఎమ్మెల్యే డా. పార్థసారథి.. # ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత # రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సరుకుల పంపిణీ చేయాలి: డీవైఎఫ్‌ఐ.. # కలకోవ గ్రామంలో నూతన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏకగ్రీవ ఎన్నిక # చెరువుల ఆక్రములపై చర్యలు తీసుకోవాలి. మత్స్య సహకార సంఘం డిమాండ్ # ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలి: MHPS నూర్ అహ్మద్... # బాధిత కుటుంబలను పరామర్శించిన - మాజీ స్పీకర్ తమ్మినేని # జలధార జలహారతితో చెరువులకు పునర్జీవం – శ్రామికులకు కలెక్టర్ డా. ఏ.సిరి అవగాహన...

* ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

Date : 09 June 2026 10:11 AM Views : 33

DNB News - తెలంగాణ / : ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహిస్తున్న పరీక్ష విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమ విద్యా సంస్థ ప్రత్యేక శ్రద్ధకనబరుస్తుందని డిల్లీ డిఫెన్స్ అకాడమీ సంస్థ అధినేత కొత్త సతీష్ రెడ్డి తెలిపారు. గత నెల 30 న విడుదల అయిన ఇండియన్ ఆర్మీ ఫలితాలలో డిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు వివిధ విభాగాలలో ఉద్యోగాలు సాధించిన నేపథ్యంలో విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిల్లీ డిఫెన్స్ అకాడమీ అధినేత కొత్త సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యా సంస్థ నుండి ఇండియన్ ఆర్మీలో 193 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ విభాగంలో 157 మంది విద్యార్థులు, అగ్నివీర్ టెక్నికల్ విభాగంలో 17 మంది విద్యార్థులు, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ విభాగంలో 14 మంది విద్యార్థులు, అగ్నివీర్ క్లర్క్ 1, ఎయిర్ ఫోర్స్ విభాగంలో 4 మంది విద్యార్థులు జే.శన్ముఖ్ సాయి రాజ్, ఎ.చరణ్ తేజ్, ఎస్.శ్రిజ, పి.మధుమిత లు ఢిల్లీ డిఫెన్స్ అకాడమి విద్యా బోధన, శిక్షణ ద్వారా ఉద్యోగాలు సాధించడం జరిగిందని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక విధానంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమ విద్యా సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. విద్యార్థులకు ప్రశ్నల సరళిపై, కఠినతా స్థాయిలపై అవగాహన పెంపొందేలా ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారి అభ్యాసనా సామర్థ్యాలు పెంచుకునేలా, వారిలోని లోపాలు తెలుసుకుని సవరించుకునేలా గ్రాండ్ టెస్టులని నిర్వహిస్తూ పరీక్షల్లో విజయం సాధించేలా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన , నిర్దిష్టమైన లక్ష్యం వుండాలని, దానికోసం నిరంతరం కృషి చేయాలని, చేసే పనిని తపస్సుతో భావించినపుడే ప్రతి ఒక్కరు విజయం సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ లక్ష్యాలపై దృష్టి పెట్టేలా వాటి సాధనకై నిరంతరం కృషి చేసేలా ప్రోత్సహిస్తూ వారి పరీక్షలకి అనుగుణంగా శారీరక, మానసిక‌ అభ్యాసాలని విద్యార్థులకి అందిస్తుండడం వలన తమ అకాడమీ విద్యార్థులు రాత, శారీరక పరీక్షల్లో విజయం సాధిస్తున్నారన్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందించేందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యున్నత భోధనా ప్రమాణాలతో శిక్షణని అందిస్తూ అన్ని ఆర్మీ ర్యాలీలలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో సైనిక ఉద్యోగాల ఆశావహులు, నిరుద్యోగులు చేరి ఉద్యోగులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :