DNB News - ఆంధ్రప్రదేశ్ / : పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో శనివారం ఆదోని పట్టణంలోని తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్ కుమార్ అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ధరలు పెంచబోమని హామీలు ఇచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14, గ్యాస్ ధరపై రూ.2 పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, కే. లింగప్ప, వైటీ వీరవరప్రసాద్, ఎం. పరశురాం, ఉరుకుందు నాయకులు వైటీ ఆది, రామాంజనేయులు, అంజి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News