DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరులోని కోతుల భావి భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం (14-03-2026) సాయంత్రం 4 గంటలకు సందర్శించనున్నట్లు సుప్రీం కోర్టు న్యాయవాది మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బి. పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరులోని సొమ్మప్ప సర్కిల్ నుండి కోతుల భావి వరకు ర్యాలీగా వెళ్లి భక్తాంజనేయ స్వామిని దర్శించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పార్టీలకతీతంగా నిర్వహించడం జరుగుతుందని, ఎమ్మిగనూరులోని హిందూ ధార్మిక సంఘాల నాయకులు, విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్, హిందూ కుల సంఘాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు, కూటమి నాయకులు మరియు ప్రతి హిందూ బంధువులు తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డా. బి. పురుషోత్తం రెడ్డి సుప్రీం కోర్టు న్యాయవాది & బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Admin
DNB News