DNB News - ఆంధ్రప్రదేశ్ / : పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించే బిల్లుకు ఆమోదం లభించిన శుభ సందర్భంగా, ఆదోని నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. అమరావతి రాజధానిగా గుర్తింపు పొందడం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ— ఈరోజు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ ఆమోదించిన చారిత్రాత్మక బిల్లును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో గర్వకారణమని తెలిపారు. “అమరావతి రాజధాని కోసం ఎన్నో సంవత్సరాలుగా జరిగిన పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఈ గొప్ప నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ప్రధానమంత్రి కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమరావతి కేవలం ఒక రాజధాని మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలకు, పెట్టుబడులకు కొత్త దారులు తెరుస్తుంది. ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి, ఈ విజయాన్ని ప్రజలందరికీ చేరవేయాలి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి నాయుడు, జిందే శంకర్, ఆదోని పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, రాష్ట్ర బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రామంజి, రంగన్న, నీలకంఠప్ప, మల్లికార్జున, శ్రీనివాస్ ఆచారి, జాఫర్, షాదుల్లా, ఐసి రామకృష్ణ, ఎక్స్ కౌన్సిలర్ బాలాజీ, రాము, నాగరాజ్, హనుమంతు, శ్రీరాములు, రాందాస్, శేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేష్, డిష్ బాషా, నాగరాజ్, అంజనప్ప, రంగన్న, ఈరన్న, సిద్ధప్ప, వలి, రియాజ్, షాది కా బేగం, అంజనమ్మ, కుమారి, ఈరమ్మ తదితర నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు.
Admin
DNB News