Tuesday, 14 April 2026 07:31:59 AM
# ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిపై చర్యలు తీసుకోవాలి – ఏఐఎస్ఎఫ్ డిమాండ్. # ప్రతి ఒక్కరు విధిగా రహదారి నిబంధనలు పాటించాలి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ. # రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక... # ఆదోనిలో అత్యాధునిక కామత్ డెంటల్ వైద్యశాల ప్రారంభం – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి.. # హైందవ ధర్మ ప్రచారం కోసం కృషి చేయాలి – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి. # చిత్తూరు జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు # అనంతపురం జిల్లా గ్రంథాలయంలో పూలే జయంతి వేడుకలు # అన్నమయ్యా జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంబరాలు # ఆదోని జిల్లా సాధన 150వ రోజు దీక్ష సభను ఘనంగా నిర్వహిద్దాం – జేఏసీ పిలుపు... # స్వచ్ఛతకు తొలి ప్రాధాన్యత – ఇంటింటి చెత్త సేకరణకు 20 వాహనాల ప్రారంభం... # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ # ఆకుపాముల గ్రామ నివాసి లిక్కి కృష్ణంరాజు వారి కుమారుడు లిక్కి వర్షిత్ సాహస యాత్ర విజయవంతం # సమానత్వ జ్యోతి వెలిగించిన మహానేత జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా # అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు # ఆస్పరి దాహార్తి ఎప్పుడు తీరుతుంది? # మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిస్తాం -- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి... # మహాత్మ జ్యోతిరావు పూలె కు ఘన నివాళులు # వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులోకి # రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత – ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో పోలీసుల ప్రత్యేక బందోబస్తు..

Date : 23 February 2026 07:06 PM Views : 63

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లావ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును పర్యవేక్షిస్తూ నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, పరీక్షా ప్రాంగణాలలో కాపీయింగ్ (మాల్‌ప్రాక్టీస్) కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసు శాఖ తరఫున పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :