Wednesday, 17 June 2026 02:30:13 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

విజయవాడలో పెను ప్రమాదం తప్పింది.

Date : 08 March 2026 01:06 PM Views : 70

DNB News - ఆంధ్రప్రదేశ్ / : పోలీసులపైనే ఓ యువకుడు పిస్టల్‌తో కాల్పులకు తెగబడటం నగరంలో కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే... పోలీసులపై కాల్పుల యత్నం: విజయవాడలో ఉద్రిక్తత విజయవాడలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు తుపాకీతో దాడికి ప్రయత్నించాడు. శనివారం తెల్లవారుజామున 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా కృష్ణలంకలోని షిరిడీ బాలాజీ లాడ్జిలో తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం జరిగిందంటే? మహబూబాబాద్ జిల్లాకు చెందిన కనకం మురళీ పటేల్ అనే యువకుడు హైదరాబాద్‌లో సినీ రంగంలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం బీహార్‌లో కొనుగోలు చేసిన 7ఎంఎం పిస్టల్‌తో ఇతడు విజయవాడకు వచ్చాడు. లాడ్జి గదిలోకి తనిఖీలకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ విజయ సారధి నాయక్‌పై మురళీ ఒక్కసారిగా పిస్టల్ ఎక్కుపెట్టాడు. అయితే ట్రిగ్గర్ లాక్ అవ్వడంతో అది పేలలేదు. సినిమా ఫక్కీలో ఛేజింగ్.. పోలీసును నెట్టేసి గది నుంచి పారిపోయిన నిందితుడు.. రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో మరో రెండుసార్లు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులు వెంబడించి, బస్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ వద్ద నిందితుడిని రాయిని విసిరి కొట్టి పట్టుకున్నారు. గ్రామ కక్షలే కారణమా? నిందితుడి వద్ద నుంచి పిస్టల్‌తో పాటు ఐదు బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రికల్ షాకింగ్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన సొంత గ్రామంలో శత్రువులు ఉన్నారని, వారి నుంచి రక్షణ కోసమే తుపాకీ కొన్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :