Monday, 15 June 2026 01:53:21 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఎస్సై పదోన్నతి ఎంపిక పరీక్షలు నిర్వహణ – కర్నూలులో పరిశీలించిన కమాండెంట్ దీపికా పాటిల్..

Date : 08 April 2026 09:33 AM Views : 80

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా... పోలీసు శాఖలోని ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుల్స్‌కు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పదోన్నతుల కోసం నిర్వహిస్తున్న ఎంపిక పరీక్షలను కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ పరీక్షల నిర్వహణ తీరును ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ పరిశీలించారు. కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. రాయలసీమ జోన్ పరిధిలోని మొత్తం 72 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుల్స్ ఈ ఎస్సై పదోన్నతి పరీక్షలకు హాజరయ్యారు. ఇండోర్ పరీక్షలు: పేపర్-1లో ఐపీసీ (భారతీయ శిక్షాస్మృతి), సి.ఆర్.పి.సి (నేరప్రక్రియ కోడ్), భారతీయ సాక్ష్యాధారాల చట్టం, ప్రత్యేక స్థానిక చట్టాలపై పరీక్షలు నిర్వహించారు. పేపర్-2లో పోలీసు విధానం, విచారణ న్యాయం, వైద్య అంశాలు, నేర వైజ్ఞానిక శాస్త్రం, వేలిముద్రలు, పాదముద్రలు, శాస్త్రీయ సహాయం, నేరాల నిరోధం మరియు గుర్తింపు తదితర అంశాలపై పరీక్షలు జరిగాయి. ఔట్‌డోర్ పరీక్షలు: ఏప్రిల్ 8న నిర్వహించనున్న ఔట్‌డోర్ పరీక్షల్లో డ్రిల్లు, ఆయుధాలపై పరిజ్ఞానం, నేరస్థల పరిశీలన, మౌఖిక పరీక్ష (ఓరల్ టెస్ట్) తదితర అంశాలపై పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు డిటిసి ప్రిన్సిపాల్ శ్రీ హుస్సేన్ పీరా గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ దుర్గాప్రసాద్ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాకు పదోన్నతులు కల్పించబడతాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ / డిటిసి ప్రిన్సిపాల్ హుస్సేన్ పీరా, డిఎస్పీ / వైస్ ప్రిన్సిపాల్ దుర్గప్రసాద్, డిఎస్పీలు శ్రీనివాసులు, బాల స్వామి రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, నన్నూరు పిహెచ్‌సి డాక్టర్ నందిని, డిఐజి కార్యాలయ మేనేజర్ రత్నప్రకాశ్, సిఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :