DNB News - ఆంధ్రప్రదేశ్ / : కిడ్నాప్ కేసులో నిందితులను కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పగిడ్యాలకు చెందిన పుల్యాల నాగిరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా అల్లూరుకు చెందిన గుత్తేదారు కె. వెంకటస్వామిని ఈ నెల 10వ తేదీన పుల్యాల నాగిరెడ్డి తన అనుచరులతో కలిసి కర్నూలులో కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురి చేసి దస్తావేజులపై సంతకాలు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్యాల నాగిరెడ్డితో పాటు మరో ఆరుగురిపై కర్నూలు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పుల్యాల నాగిరెడ్డి, మోక్షేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, మద్దిలేటిరెడ్డి, రాజు మరియు కారు డ్రైవర్‌ను నిందితులుగా గుర్తించారు. ఈ మేరకు పుల్యాల నాగిరెడ్డి, గంగిరెడ్డి మద్దిలేటిరెడ్డి, రామిరెడ్డి గారి రాఘవరెడ్డిని బుధవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి దస్తావేజు పత్రాలు, ప్రామిసరీ నోట్లు మరియు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు రెండో పట్టణ సీఐ నాగరాజరావు తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Admin
DNB News