DNB News - ఆంధ్రప్రదేశ్ / : పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఈద్గా వద్ద ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి, సౌహార్దం, సహనానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సఖ్యతతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
Admin
DNB News