DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్‌ఐఓ (RIO)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న కళాశాలలను వెంటనే గుర్తించి, సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే ఫీజుల దోపిడీని అరికట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Admin
DNB News