DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలో నిర్వహించిన నీట్ పరీక్ష కేంద్రాలను ఇంచార్జి జిల్లా కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదివారం పరిశీలించారు. న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ (మైనార్టీస్), ఉర్దూ పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాల, కె.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల, ఇందిరా గాంధీ మెమోరియల్ స్కూల్‌లలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు సజావుగా, పారదర్శకంగా జరుగుతున్నాయో లేదో స్వయంగా తనిఖీ చేశారు. అలాగే కేంద్రాల్లో విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలనీ సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు.
Admin
DNB News