DNB News - ఆంధ్రప్రదేశ్ / : అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 మార్చి 28న శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహకారంతో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగా, అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రంలోని మిత్రపక్షాల నాయకులకు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు తెలుగు యువత అధ్యక్షుడు ఎస్. అబ్బాస్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగరంలోని కొండారెడ్డి బురుజు నుండి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
DNB News