DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహా పర్వదినమైన మహాశివరాత్రి సందర్భంగా తమ్మినేని సీతారాం తన సతీమణి వాణితో కలిసి ఉమా రుద్ర కోటేశ్వర స్వామి వారిని ఆదివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు శ్రీకాకుళం పట్టణంలోని ఈ చారిత్రక శైవక్షేత్రంలో మాజీ స్పీకర్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి,స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం పౌర సమాజానికి ఆధ్యాత్మిక ధ్రువతారగా నిలిచిందని పేర్కొన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా, సామాజిక ఐక్యతకు నిలయంగా నిలుస్తోందన్నారు శివరాత్రి మహా పర్వదినం సందర్భంగా పట్టణ ప్రజలంతా ఒకేచోట చేరి భక్తి భావంతో పాల్గొనడం ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత అని చెప్పారు.శివరాత్రి వంటి మహా పర్వదినాలు మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు,సామాజిక సమగ్రతను బలపరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్వామివారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజానీకం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Admin
DNB News