DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం జిల్లా,: జామి మండలం, శృంగవరపుకోట నియోజకవర్గంలోని గుడుకొమ్ము మరియు కలగడ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ అధ్యక్షులు గోర్లే రవికుమార్ ఆధ్వర్యంలో శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు వున్నా కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ పధకాలు ఇవ్వకపోగా గతంలో వచ్చిన నవరత్నాలు పథకాలు తీసేసింది అని వాస్తవాలను వివరించారు.ఈ రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలు యొక్క సమస్యలు తెలుస్తాయి అని,దానితో పాటు వైస్సార్సీపీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలియజేసారు... అనంతరం వైస్సార్సీపీ కేంద్రకమిటీ ఆదేశాలు మేరకు గ్రామ కమిటీలను, గ్రామకమిటీ ఇంచార్జిలను, మరియు అన్ని BC' SC' మహిళా' సోషల్ మీడియా' విద్యార్థి' రైతు విభాగాల కమిటీలు కమిటీ ఇంచార్జిలా నియామకాలను ఆ గ్రామ ప్రజలు యొక్క అంగీకారంతో చేపట్టి వాటియొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదల వెంకట్రావు గారు సర్పంచ్ బాదిరెడ్డి సత్యవతి గారు MPTC రమణమ్మ గారు మండలం యువజన విభాగం అధ్యక్షులు పిన్ని0టి రవికుమార్ గారు మండలం అనుబంధంకమిటీ నెంబర్ సింగరపు అప్పలరాజు సూరిదేముడు గారు మరియు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News