DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం సదాపురం గ్రామానికి చెందిన బి. నర్సమ్మ పక్షవాతానికి గురై నడవలేని పరిస్థితిలో ఉండటంతో వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చారు. ఆమె పరిస్థితిని గమనించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ స్వయంగా వాహనం వద్దకు వెళ్లి ఆమెను పరామర్శించారు. నర్సమ్మ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హతలు పరిశీలించి త్వరగా వికలాంగుల పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
Admin
DNB News