DNB News - ఆంధ్రప్రదేశ్ / : విపత్కర పరిస్థితిల లోనూ ఉత్పత్తి, ఉత్పదాకాలలో రికార్డులు నెలకొల్పుతూ నష్టాల ఊబి నుండి లాభాల బాట పట్టిస్తున్న విశాఖ స్టీల్ కార్మికులు, అధికారులకు అభినందనలు తెలిపిన DSEU జనరల్ సెక్రటరీ బొండా యల్లాజీరావు** *********************విశాఖ స్టీల్ కార్మికులు ప్లాంట్ ప్రయివేటికరణ జరగదు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పై పూర్తి విశ్వాసంతో ఉత్పత్తి,ఉత్పధకాలలో రికార్డులు సాధిస్తూ,విశాఖ ఉక్కు ఉద్యోగుల సామర్ధ్యం, అంకితభావం నిరూపించడం జరుగుతుంది . గత ప్రభుత్వాల అనాలోచిత, అవినీతి, చర్యలు ఒక వైపు, కొన్ని యూనియన్ లు వారి స్వలాభం కొరకు కార్మిక సంక్షేమము, ప్లాంట్ పరిరక్షణ గాలికి వదిలి ట్రేడింగ్ చేసుకొని ప్లాంట్ ను పూర్తిగా ముంచేసారు.అరకొర సౌకర్యాలు, చాలి చాలని జీతాలుతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతూనే, కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ను బ్రతికించే ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్న ఉద్యోగులు, కార్మికులు కలిసి కట్టుగా తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్లాంట్ ను లాభాల బాట పట్టిస్తున్నారు.వారికి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున అభినందనలు, జేజేలు పలుకుతున్నాను. అదేసమయంలో జీతాలు లేకపోయినా, సౌకర్యాలు అన్నీ తీసివేసినా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ, ఉక్కు శాఖామాత్యులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ గార్లపై నమ్మకంతో పని చేస్తున్న కార్మికులకు తక్షణమే జీతం బకాయిలు, సౌకర్యాలు మెరుగు పరచాలని, రిటైర్ అయినా,వి ఆర్ ఎస్ తీసుకున్న వారికి పూర్తి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, రిటైర్ అయిన కార్మికులు అందరికి హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని, మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని పాత పద్ధతి లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను* బొండా యల్లాజీరావు--- జనరల్ సెక్రటరీ---- డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్ --DSEU
Admin
DNB News