DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని :ఆదోనిలోని ఎల్లే మల్లేశప్ప (YMK) కన్నడ పాఠశాలలో ఆదివారం 1973–74 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమను తీర్చిదిద్దిన పూర్వ గురువులు ప్రభుదాస్, గురులింగయ్య, నాగరాజు, మల్లికార్జున, మల్లప్పలను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1973–74 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పాఠశాల రోజుల జ్ఞాపకాలను, ఆనాటి అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత పాత స్నేహితులను కలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ సమ్మేళనం స్నేహబంధాలను మరింత బలోపేతం చేసిందని పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ ఎంఈఓ ఈరన్న సార్, దేశాయ్ చంద్రన్నతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అనంతరం అందరూ ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని ముగించారు.
Admin
DNB News