DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) ఆర్థిక సహకారంతో, మెప్మా ఆధ్వర్యంలో ఐదుగురు స్వయం సహాయక సంఘాల మహిళలకు చికెన్ అండ్ ఎగ్ కార్ట్స్ ను మంజూరు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పాల్గొని కార్ట్స్ ను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. మెప్మా ద్వారా మహిళా సంఘాలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Admin
DNB News