Wednesday, 17 June 2026 02:45:24 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి – ఎమ్మెల్యే పార్థసారధికి నూర్ అహ్మద్ సవాల్..

Date : 28 March 2026 02:59 PM Views : 69

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో జరిగిన భూ కబ్జాలు, అవినీతి అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (MHPS) రాష్ట్ర కార్యదర్శి ఏ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పాలనలో భూ కబ్జాలు, అరాచకాలపై విమర్శలు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్థసారధి, ఇప్పుడు తానే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భూ కబ్జాలకు సహకరిస్తున్నారనే వార్తలు రావడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల ఆదోనిలో ఇప్పటికే దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగం మరింత సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుండటంతో ఆదోని సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే పార్థసారధి నిజాయితీ గల నాయకుడైతే, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాదరెడ్డి పాలనలో జరిగిన భూ కబ్జా ఆరోపణలు, అవినీతి అంశాలపై సీబీఐ విచారణకు వెంటనే సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సర్వే నంబర్ 162 ఆన్‌లైన్ వ్యవహారంలో తన పాత్రపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే పార్థసారధిని కోరారు. మరోవైపు, తన పాలనలో ఎలాంటి భూ కబ్జాలు జరగలేదని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాదరెడ్డి చెప్పడం హాస్యాస్పదమని నూర్ అహ్మద్ విమర్శించారు. గత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే డాక్టర్ పార్థసారధిని ఎమ్మెల్యేగా గెలిపించిందని పేర్కొన్నారు. అలాగే, సాయి ప్రసాదరెడ్డిపై విచారణ కమిషన్ వేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మను డిమాండ్ చేశారు. పాలక, ప్రతిపక్ష నాయకులు పరస్పర విమర్శలు మానుకొని ఆదోని నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడు షకీల్ పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :