DNB News - ఆంధ్రప్రదేశ్ / : మునగాల:మండలపరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల పరిధిలోని నరసింహులగూడెం గ్రామం నందు ఆయుష్మాన్ ఆరోగ్య శివిర్ క్యాంపు నిర్వహించడం జరిగింది.. వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య, ప్రారంభించి మాట్లాడుతూ,మనగ్రామంలో ఆరోగ్యశాఖ వారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు..ఆరోగ్య విస్తరణ అధికారి భాస్కర్ రాజు, మరియు టీబీ నోడల్ పర్సన్ లింగం రామక్రిష్ణ గారు మాట్లాడుతూ,వారానికి నుంచి దగ్గు ఆయాసం కళ్ళే పడడం, చాతిలో నొప్పి బరువు తగ్గడం, ఆకలి మందగించడం . ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలనీ తెలిపారు నిక్షయ్ శిబిర్ ప్రచారం అనేది 2030 వరకు భారత దేశాన్ని క్షయ రహిత దేశంగా మార్చే లక్ష్యం వేగవంతం చేయడానికి నిర్వహించే కార్యక్రమమన్నారు. క్షయ వ్యాధి గ్రస్తులు 6నెలల మందులు వాడితే నయం అవుతుంది. ఈ రోజు క్యాంప్ లో 80 మందికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు.. కేంద్ర ప్రభుత్వం వారు పౌష్టిక ఆహారం కొరకు నెలకు 1000 చొప్పున అందిస్తుంది.. ఈ కార్యక్రమం ద్వారా సామూహికంగా క్షయ నిర్ధారణ కొరకు స్ఫుటం పరీక్ష, ఎక్స్రే పరీక్ష, ద్వారా పరీక్ష నిర్వహించి రోగులను త్వరితంగా గుర్తించడం సకాలంలో వారికి మందులు అందించడం జరుగుతుందన్నారు. నిక్షయ్ శిబిర్ కార్యక్రమం టీబీ ద్వారా సంభవించే మరణాలు తగ్గించడం, క్షయ సంరక్షణ కోసం చేసేఖర్చును సున్నాకు తగ్గించటం ముఖ్యలక్ష్యం అన్నారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ సీతారాములు,నర్సయ్య, మాజీ సర్పంచ్ కొండా రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, టిబి సూపర్వైజర్ సుభాషిణి, ఎస్.టీ. ఎల్.ఎస్. సైదులు,ఎం పద్మ,హెల్త్ అసిస్టెంట్ సైదులు ,ఆశా కార్యకర్తలు సుధారాణి, జ్యోతి రమణ,నాగమ్మ,లక్ష్మీ, విజయలక్ష్మి ,గ్రామపంచాయతీ సిబ్బంది నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News