Monday, 15 June 2026 02:23:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

నీటి ఎద్దడి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు: కమిషనర్ చల్లా ఓబులేసు..

Date : 05 May 2026 10:59 AM Views : 33

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలో ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఆదివారం ఆయన సుంకేసుల జలాశయం, మునగాలపాడు నీటి శుద్ధి కేంద్రం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి పరిశీలించారు. జలవనుల శాఖతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ నీటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నీటి శుద్ధి కేంద్రాల్లో మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని, శుద్ధి ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు. శుద్ధి కేంద్రాల పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంజనీరింగ్ అధికారులు ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య రాకుండా మూడు వేర్వేరు ప్రాజెక్టుల్లో మొత్తం 3.64 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 0.16 టీఎంసీల నీరు నిండుగా ఉందని, సుంకేసుల జలాశయంలో 1.2 టీఎంసీల నిల్వ ఉందన్నారు. అలాగే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 2.28 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జూలై నెలాఖరు వరకు సరిపడా నీటి నిల్వలు ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, ఏఈ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :