Monday, 15 June 2026 02:06:07 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

బడిబాట కార్యక్రమం

Date : 08 April 2026 02:51 PM Views : 36

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జగన్నాధపురం లో బడిబాట ర్యాలీ కార్యక్రమం ఓ ఆర్ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. మండలం పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలులో భాగంగా మంగళవారము నాడు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమమును నిర్వహించినారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వం పిల్లలకి అందిస్తున్న నాణ్యమైనవిద్య ,ఉచిత పాఠ్యపుస్తకములు, నోట్ బుక్స్ మధ్యాహ్న భోజనం, క్రీడా పరికరాలు, బోధనోపకరణముల ద్వారా నైపుణ్యమైన బోధన, తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని, మనబడి కల్పిస్తుందని, నైపుణ్యమైన ఉపాధ్యాయుల ద్వారా బోధన కొనసాగుతుందని, ఇంగ్లీష్ మీడియం కు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యనభ్యసించడం వలన ఉన్నత విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా సంఘసంస్కర్తలుగా, రాజకీయ నాయకులుగా, సంపూర్ణ మూర్తిమత్వం కలిగిన పౌరులుగా తయారవుతారని, ఎదుగుతారని, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై, ప్రజాప్రతినిధులకు యువజనులకు, మహిళా సంఘాల ప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరిపై ఉందని, వచ్చే విద్యా సంవత్సరానికల్లా మన ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకుందామని, విద్యార్థుల నమోదును పెంచుతామని బడి ఈడు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దామని, ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంఎం. సతీష్ కుమార్ డి. విజయ విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :