DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.
Admin
DNB News