DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆర్టీసీ కాలనీలో భారీ వృక్షం నేలకొరిగి రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ ముఖద్వారం పక్కన ఉన్న మున్సిపల్ పార్కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారీగా పడిపోయిన ఈ చెట్టు పార్కు గోడపై మరియు సమీపంలోని విద్యుత్ తీగలపై పడటంతో ఆర్టీసీ కాలనీ, శ్రీనగర్, విట్టాకిష్టప్ప నగర్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే చెట్టు రహదారిపై అడ్డంగా పడటంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదృష్టవశాత్తు చెట్టు కూలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై స్థానికులు మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ శాఖ తక్షణ చర్యలు తీసుకుని చెట్టును తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Admin
DNB News