DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానిక బిర్లా గేట్ వద్ద నిర్వహించిన మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే గారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యాభివృద్ధికి చేసిన సేవలు అపారమని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మ పూలే సేవలను స్మరించుకున్నారు.
Admin
DNB News