DNB News - ఆంధ్రప్రదేశ్ / : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మాజీ పార్లమెంట్ సభ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్, బస్టాండ్, బడేసాబ్ దర్గా, కమిటీ కూడళ్ల వద్ద బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ, తీవ్రమైన వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో బుట్టా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు సేవ చేయడం తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బుట్టా ఫౌండేషన్ సభ్యులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News