DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ సామ్రాజ్య వాదులకు ముచ్చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 న పురస్కరించుకొని పట్టణంలోని అమరావతి నగర్ లో నివాసముంటున్న సెంట్రింగ్ మేస్ర్తీ యం. నరసింహులు, యం.దేవికల పెద్ద కుమారుడు నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల 8వ తరగతి ఏ విభాగం లో చదువుతున్న యం.ఈరన్న రావి ఆకుపై నేతాజి సుభాష్ చంద్రబోస్ చిత్ర పటం ఆకృతిని తయారుచేసి అబ్బురపరిచాడు. పాఠశాల మండల విద్యాధికారి -2 శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థి యం.ఈరన్న ను డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్. కీర ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఈరన్న మాట్లాడుతూ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేశానని, ఈ చిత్రం చేయడానికి 2 గంటల సమయం పట్టిందని తెలిపాడు. అనంతరం డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్. కీర మాట్లాడుతూ విధ్యార్థులలోని సృజనాత్మకతను నైపుణ్యాన్ని వెలికితీసేందుకు మరియు స్వతంత్ర సమరయోధుల గురించి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటామని తెలిపారు.
Admin
DNB News