DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు వైద్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సమన్వయంతో పనిచేయాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పిలుపునిచ్చారు. మంగళవారం ఆశా వర్కర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదోనిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల పాత్ర అత్యంత కీలకమని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సేవల అమలులో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తమవంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కామేశ్వర ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యవతి, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News