DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా తెలుగు నేల గర్వించదగ్గ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1846 సంవత్సరంలో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన తొలి వీరులలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరని పేర్కొన్నారు. యువత దేశభక్తి, త్యాగం, నిబద్ధత వంటి విలువలను అలవర్చుకుని సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News