DNB News - ఆంధ్రప్రదేశ్ / : తాడ్వాయి గ్రామ పంచాయతీ పరిధిలో 9 వార్డు సభ్యులు జిల్లేపల్లి సుమన్ అధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్ధానిక సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య హాజరై మాట్లాడారు. గ్రామీణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జిల్లేపల్లి సుందరయ్య,శోభన్ ,సతీష్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం యుద్ధం చేసిన ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అంటరాని తనం, కులవివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశను చూపిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో 7 వార్డు సభ్యులు కోండమీది శైలజ లక్ష్మి నారాయణ, మాజీ వార్డు సభ్యులు మచ్చ శంకర్, మంగతాయారు, విజయ్ కుమార్,సోమపంగు గోపి,మచ్చ పాండు,జిల్లేపల్లి శ్రీనివాస్, ఆదూరి లచ్చయ్య, సురేష్,శివ, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News