DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవం జాతర భక్తుల సందడిలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వెండి రథాన్ని పురవీధుల్లో ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Admin
DNB News