DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో రానున్న రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణపై సమగ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, బిజెపి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ పాల్గొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించాలని, ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలను కొనసాగించాలని నాయకులు సూచించారు. ఈ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి పాల్గొని పార్టీ కార్యక్రమాల అమలుపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే దిశగా నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు
Admin
DNB News