DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి & జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో భద్రతా ఏర్పాట్లను ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ భార్గవి పరిశీలించారు. బుధవారం కోర్టు సూపరింటెండెంట్ విష్ణుప్రియతో కలిసి కోర్టులోని రికార్డుల రూమ్, న్యాయాధికారుల భద్రతా ఏర్పాట్లు, ప్రహరీ గోడలు తదితర అంశాలను అధికారులు సమీక్షించారు. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని కోర్టుల్లో చోటుచేసుకుంటున్న దాడుల నేపథ్యంలో, ఎమ్మిగనూరు కోర్టు ప్రాంగణంలో లాయర్లు, సాక్షులు మరియు న్యాయాధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశీలనకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు, ఎస్సై మధుసూదన్ రెడ్డి, ఆర్ & బీ డీఈ నాగరాజు, సూపర్వైజర్ ప్రభు, ఎలక్ట్రిక్ డీఈ నాగేంద్ర ప్రసాద్, ఏఈ ప్రసన్నరాజు, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News