DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు పర్యటనలో భాగంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రిని కలవడం తన రాజకీయ జీవితంలో ఒక అపూర్వమైన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకు పర్యటించడం జిల్లాకు మరో చారిత్రాత్మక సందర్భమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజాసేవే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తూ, ముఖ్యమంత్రి ఆశయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
Admin
DNB News