DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ వెనిజులాపై అమెరికా దురాక్రమణ దాడిని తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేసింది. అలాగే రైతు సంఘం రాష్ట్ర నాయకులు అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ అంశాలపై సీపీఎం పార్టీ తరఫున విడుదల చేసిన పోస్టర్లను పార్టీ సీనియర్ నాయకులు ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, నాయకులు నాగరాజు, కృష్ణమూర్తి తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సామ్రాజ్యవాద ధోరణితో అమెరికా వెనిజులాపై చేస్తున్న దాడులు అంతర్జాతీయ శాంతికి ముప్పుగా మారుతున్నాయని విమర్శించారు. మరోవైపు ప్రజా ఉద్యమ నేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. అప్పలరాజుపై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించి, ప్రజా ఉద్యమాలపై అణచివేత చర్యలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
Admin
DNB News