Saturday, 13 June 2026 07:09:45 AM
# రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.. # ISPL టోర్నమెంట్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి.. క్రీడాకారులకు ప్రోత్సాహం.. # కేంద్ర సబ్సిడీ రుణ పథకాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోండి: ఎమ్మెల్యే డా. పార్థసారథి.. # ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత # రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సరుకుల పంపిణీ చేయాలి: డీవైఎఫ్‌ఐ.. # కలకోవ గ్రామంలో నూతన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏకగ్రీవ ఎన్నిక # చెరువుల ఆక్రములపై చర్యలు తీసుకోవాలి. మత్స్య సహకార సంఘం డిమాండ్ # ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలి: MHPS నూర్ అహ్మద్... # బాధిత కుటుంబలను పరామర్శించిన - మాజీ స్పీకర్ తమ్మినేని # జలధార జలహారతితో చెరువులకు పునర్జీవం – శ్రామికులకు కలెక్టర్ డా. ఏ.సిరి అవగాహన...

కేంద్ర సబ్సిడీ రుణ పథకాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోండి: ఎమ్మెల్యే డా. పార్థసారథి..

Date : 05 June 2026 07:50 AM Views : 17

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని ఆదోని ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి సూచించారు. కెనరా బ్యాంక్ ఓల్డ్ టౌన్ శాఖ చీఫ్ మేనేజర్ రాజేష్ రాజమోహన్ ఆధ్వర్యంలో ఆదోని ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు మరియు పారిశ్రామికవేత్తలతో అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణ పథకాల ద్వారా యువత, రైతులు, చిన్న వ్యాపారవేత్తలు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకులు చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ మాట్లాడుతూ, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ విరివిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలులో బ్యాంకులు, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అలాగే సీసీఆర్‌సీ (CCRC) కార్డులు కలిగిన కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. PMEGP, PMFME, PM Surya Ghar తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన వారికి రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలని సూచించారు. సీబీఆర్‌సెటి (CB RSETI) డైరెక్టర్ పుష్ప కుమార్ మాట్లాడుతూ, కర్నూలు జిల్లా బి. తాండ్రపాడులోని శిక్షణ కేంద్రంలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ పరిధిలోని వివిధ బ్యాంకుల శాఖ మేనేజర్లు, అగ్రికల్చర్, DRDA, MEPMA మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి అభిలాషులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :