DNB News - ఆంధ్రప్రదేశ్ / : హనుమాన్ జయంతి సందర్భంగా ఆదోని అంబేద్కర్ నగర్‌లోని శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన 15వ రథోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం పురవీధుల గుండా రథయాత్రను ఘనంగా చేపట్టారు. రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పూలతో అలంకరించిన రథంలో స్వామివారి విగ్రహాన్ని ఊరేగించగా భక్తులు హారతులు ఇస్తూ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో నిర్వహించిన సామూహిక వివాహాల్లో పాల్గొని నవదంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News