DNB News - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతిలోని బాలాజీ కాలనీ నందు అంబేద్కర్ భవన్లో భాదిత దళిత మహిళా ప్రిన్సిపాల్ మంగ రాణి తో కలిసి అఖిలపక్ష విద్యార్థి,యువజన, ప్రజాసంఘాల జేఏసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవల శశి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ జే. మంగ రాణి కి ముందస్తూ నోటీసులు ఇవ్వకుoడ అద్దాంతరంగా తొలగించిన తీరు కుల వివక్షతో ఉన్నదని తక్షణమే ఆ విద్యాసంస్థల డైరెక్టర్ కిరణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రాకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ జే. మంగ రాణి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ విద్యాసంస్థల యాజమాన్యం వద్దే ఉంచుకుని వేధింపులకు పాల్పడుతున్నారు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం తీసేసినందున లేబర్ యాక్ట్ ప్రకారం ఇప్పటివరకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. శశి విద్యా సంస్థల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య ప్రయత్నం కూడా జరిగిందని ఈ ఘటన చాలా బాధాకరమని వాపోయారు. ఈ ఘటనను సంబంధిత పోలీస్ మరియు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శశి విద్యా సంస్థలకు గుర్తింపును రద్దుచేసి డైరెక్టర్ కిరణ్ పై కేసు నమోదు చేయని పక్షంలో విద్యా సంస్థల ఎదుట నిరసన దీక్ష చేపడతామని తెలియజేశారు. అలాగే శశి విద్యా సంస్థల్లో విద్యాహక్కు చట్ట ప్రకారం చదువుతున్న విద్యార్థుల నుండి ఫీజుల దోపిడీ జరుగుతున్నదని వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
Admin
DNB News