DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో క్రైసిస్ మేనేజ్మెంట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదలు, భారీ వర్షాలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విపత్తు సమయంలో తక్షణ స్పందన కోసం అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర సేవల నిర్వహణ, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, హెచ్చరిక వ్యవస్థల బలోపేతం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ శాఖల విపత్తు నిర్వహణ ప్రణాళికలను వివరించారు.
Admin
DNB News