DNB News - ఆంధ్రప్రదేశ్ / : అనంతపురం జిల్లా, గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సేవాఘడ్‌లో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఫిబ్రవరి 14, 15 తేదీలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావడానికి ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కొనసాగుతున్న జాటోతు హుస్సేన్ నాయక్ అనంతపురం వెళ్తూ శనివారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయనను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు వేగవంతం, బాధితులకు చట్టపరమైన సహాయం అందించడం, అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Admin
DNB News