DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలోని ప్రజలు ప్రాథమిక సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యతో పాటు మరుగుదొడ్లు లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు దయనీయ స్థితిలో ఉండడం, వీధి దీపాల లేమి, స్థిరమైన ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యలపై స్పందించిన కలెక్టర్ వెంటనే ఆదోని మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి, ముఖ్యంగా తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఆదోని ప్రజలకు అవసరమైన అన్ని ప్రాథమిక వసతులను త్వరితగతిన కల్పించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
Admin
DNB News