Tuesday, 14 April 2026 06:07:43 AM
# ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిపై చర్యలు తీసుకోవాలి – ఏఐఎస్ఎఫ్ డిమాండ్. # ప్రతి ఒక్కరు విధిగా రహదారి నిబంధనలు పాటించాలి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ. # రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక... # ఆదోనిలో అత్యాధునిక కామత్ డెంటల్ వైద్యశాల ప్రారంభం – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి.. # హైందవ ధర్మ ప్రచారం కోసం కృషి చేయాలి – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి. # చిత్తూరు జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు # అనంతపురం జిల్లా గ్రంథాలయంలో పూలే జయంతి వేడుకలు # అన్నమయ్యా జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంబరాలు # ఆదోని జిల్లా సాధన 150వ రోజు దీక్ష సభను ఘనంగా నిర్వహిద్దాం – జేఏసీ పిలుపు... # స్వచ్ఛతకు తొలి ప్రాధాన్యత – ఇంటింటి చెత్త సేకరణకు 20 వాహనాల ప్రారంభం... # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ # ఆకుపాముల గ్రామ నివాసి లిక్కి కృష్ణంరాజు వారి కుమారుడు లిక్కి వర్షిత్ సాహస యాత్ర విజయవంతం # సమానత్వ జ్యోతి వెలిగించిన మహానేత జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా # అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు # ఆస్పరి దాహార్తి ఎప్పుడు తీరుతుంది? # మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిస్తాం -- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి... # మహాత్మ జ్యోతిరావు పూలె కు ఘన నివాళులు # వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులోకి # రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

Date : 23 February 2026 02:12 PM Views : 348

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగి రమేష్‌ను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఆయన స్వగృహంలో పరామర్శించారు.కూటమి ప్రభుత్వ ప్రతీకార చర్యల వల్ల జోగి రమేష్ మరియు ఆయన కుటుంబ సభ్యులు పడిన ఆవేదనను, ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా తమ్మినేని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే హక్కు తమకు ఉందని, కానీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అనవసర రాద్ధాంతం చేసి ప్రభుత్వం అబాసుపాలైందని, అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను జోగి రమేష్ సమర్థవంతంగా ఎండగట్టారని గుర్తు చేశారు. ఈ కారణంతోనే ఆయనను టార్గెట్ చేస్తూ 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడితే కూటమి సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, జోగి రమేష్ కుటుంబానికి వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ అండగా ఉంటాయని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుంపల రామారావు సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి రాష్ట్రా ఇంటలెక్చువల్ కార్యదర్శి పిల్లల రామకృష్ణ కొత్తూరు మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ తదితరులు పాల్గున్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :