DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన 2026-27 బడ్జెట్ ఔట్రీచ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం & ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి తో పాటు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు మరియు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ, వాటి సమర్థ అమలుపై చర్చలు జరిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాలను ప్రజలకు చేరవేయాలని నాయకులు సూచించారు.
Admin
DNB News