DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఎన్నో రంగాల్లో ప్రతిభ చూపిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. విద్యే వ్యక్తి భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగడం ఆనందకరమని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. చివరగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ముగించారు.
Admin
DNB News