DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక–రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఆదోనిలో AITUC, CITU, IFTU మరియు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంత మంగళాంజనేయ స్వామి కళ్యాణమండపం నుంచి భీమా సర్కిల్ మీదుగా ఏరియా హాస్పిటల్ వరకు కార్మికులు, రైతులు ప్రదర్శనగా సాగారు. నాయకులు మాట్లాడుతూ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, కనీస వేతనాల అమలు, పంటలకు గిట్టుబాటు ధర వంటి అంశాలపై ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కానిచో భవిష్యత్తులో మరింత ఉధృతమైన పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
Admin
DNB News