DNB News - ఆంధ్రప్రదేశ్ / : 03 జూన్ 2026 రోజు ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ & ఏ. జె. పెడల్స్ సంయుక్తంగా నిర్వహించే సైక్లింగ్ ర్యాలీలో ఔత్సాహిక సైక్లిస్టులు, సైక్లింగ్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ .వి. నరేందర్ రెడ్డి, అధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డిలు మరియు ఇతర బాధ్యులు విజ్ఞప్తిచేశారు. ఈ రోజు నగరంలోని వామిలాలపల్లి లో గల అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడుతూ 03 జూన్ రోజున ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌక్ నుంచి ఎలగందల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొని పూర్తి చేసిన సైక్లిస్టులకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన అన్ని వయస్సుల వారు ఈ ర్యాలీలో తమ సైకిల్‌లతో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు నిత్యం విధిగా సైక్లింగ్ చేయడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం కలుగుతుందని, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ సంక్షోభాల వల్ల చమురు కొరత ఏర్పడడం, చమురు ధరలు పెరగడం వంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తాయని, దీనికి విరుగుడుగా శిలాజ ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ, సైక్లింగ్‌ను ప్రతి ఒక్కరు తమ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గలవారు 03 జూన్ రోజు ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద సైకిళ్ళతో హాజరు కావాలని కోరారు. ఈ గోడ ప్రతి ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురభి వేణుగోపాల్, కోశాధికారి వి.జగదీశ్వరా చారి, కార్యవర్గ సభ్యులు అఖిల్ రెడ్డి, డా: వడ్లూరి శ్రీనివాస్, ఎం మహెందర్ & తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 9032762247 & 9398230614 నందు సంప్రదించగలరని తెలిపారు
Admin
DNB News