Friday, 19 June 2026 02:52:00 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 65 ఫిర్యాదులు – విచారణ చేసి చట్టపరంగా న్యాయం చేస్తాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్.

Date : 10 March 2026 10:47 AM Views : 86

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా వినిపించి, ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి ఇవి: బెంగుళూరులోని డెలాయిట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పామిడికి చెందిన చింతల సోమశేఖర్ రూ.1 లక్ష తీసుకొని మోసం చేశాడని ఆదోనికి చెందిన నరేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. గూడూరులో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌ను తన భర్త రమేష్ ఆక్రమించుకోవాలని తన సంతకాలను ఫోర్జరీ చేసి, ఆస్తి మరియు చెక్ బౌన్స్ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నాడని కర్నూలుకు చెందిన రాధిక ఫిర్యాదు చేశారు. కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చిన తనను కళ్ళు సరిగా కనిపించకపోవడాన్ని ఉపయోగించుకుని శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ పత్రాలపై ష్యూరిటీ సంతకాలు చేయించారని, రూ.7 లక్షల లోన్ సమస్యపై సూపర్వైజర్ రఘుబాబు, లలితమ్మ, కిరణ్ పై చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన పబ్బతి నారాయణ ఫిర్యాదు చేశారు. విద్యాంజలి పథకం కింద పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్‌కు చెందిన సుజాత ఠాకూర్ రూ.40 లక్షలు తీసుకొని మోసం చేసిందని కర్నూలు బి.క్యాంపుకు చెందిన అహ్మద్ ఉన్నీషా ఫిర్యాదు చేశారు. కర్నూలు రాం ప్రియనగర్‌లో ఉన్న తన ప్లాట్‌ను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారపేటకు చెందిన శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం బాగోలేకపోయినా తన పెద్ద కుమారుడు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన యశోదమ్మ ఫిర్యాదు చేశారు. తన భర్త గుండెపోటుతో మరణించగా, ఆయన పేరుమీద ఉన్న జీవిత భీమా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలానికి చెందిన సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అన్ని ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్, సిఐ శివశంకర్ పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: